: కుర్తా పైజామా ధరించి రోడ్ షోలో పాల్గొన్న జపాన్ ప్రధాని షింజో అబే.. చుడిదార్ ధరించిన షింజో భార్య!
భారత పర్యటనలో ఉన్న జపాన్ ప్రధానమంత్రి షింజో అబే గుజరాత్‌లోని అహ్మదాబాద్ లో ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో షింజో అబే మోదీలా కుర్తా పైజామా ధరించి కనిపించారు. అంతేకాదు, షింజో సతీమణి అఖీ అబే రోడ్‌షోలో చుడిదార్ ధరించారు. రోడ్డుకి ఇరువైపులా నిలబడి గుజరాత్ వాసులు ఆ దంపతులను ఆహ్వానించారు. ఈ రోడ్ షోను సుమారు 8 కిలోమీటర్ల మేర నిర్వహించారు. ప్రస్తుతం మోదీతో కలిసి వారు సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తున్నారు. రేపు ఇరు దేశాధినేతల చేతుల మీదుగా భారత తొలి బుల్లెట్ రైలుకు శంకుస్థాపన జరగనుంది.