: ఎమ్మెల్యేకు కల్తీనెయ్యి వడ్డించిన హోటల్ సిబ్బంది.. జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం!
భారతీయ జనతా పార్టీ నేత, ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌కు చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ కుషాయిగూడలోని ఓ హోటల్ కు భోజనానికి వెళ్లిన ఆయనకు హోటల్ సిబ్బంది కల్తీ నెయ్యి వడ్డించారు. ఈ విషయాన్ని గుర్తించిన ప్రభాకర్ వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే, తాను ఫిర్యాదు చేసినప్పటికీ జీహెచ్ఎంసీ అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం హోటల్లో కల్తీ నెయ్యి పై ఫుడ్ ఇన్స్పెక్టర్లకు సదరు ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు.