: ఆత్మహత్య చేసుకోబోతున్న బాలికను కాపాడిన ప్రధానోపాధ్యాయుడు... వీడియో చూడండి!
తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతూ 17 అంతస్తుల భవనం మీద నుంచి దూకి ఆత్మహత్య చేసుకోబోతున్న విద్యార్థినిని పాఠశాల ప్రిన్సిపాల్ కాపాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సంఘటన చైనాలోని గైజోవ్ ప్రాంతంలో జరిగింది. కాపాడటానికి వచ్చిన రక్షణ సిబ్బందిని ఆ బాలిక దగ్గరికి కూడా రానివ్వలేదు. అయితే మంచినీళ్లు అందిస్తున్నానంటూ ప్రిన్సిపాల్ ఆమె దగ్గరికి వెళ్లి, ఒక్కసారిగా చొక్కా పట్టుకుని బాలికను వెనక్కి లాగాడు. విద్యలో ఉత్తీర్ణత మీద ఎక్కువగా దృష్టి సారించే చైనా దేశంలో చాలా మంది పిల్లలు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని ఆ దేశ మీడియా పేర్కొంది.