: 110 ఏళ్లు అధికారంలో ఉండాలని కోరుతూ.. 110 అడుగుల మోదీ కటౌట్!
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రముఖ ఆర్టిస్టు జుల్‌ఫికర్ హుస్సేన్.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పుట్టిన రోజు బహుమతి ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తి చేసుకుంటున్నారు. ఈ నెల 17న మోదీ 67వ జన్మదినాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో ఆయన భారత్‌కి మరో 110 సంవత్సరాలు అధికారంలోనే ఉండాలని ఆశిస్తూ 110 అడుగుల మోదీ కటౌట్‌ను రూపొందిస్తున్నారు. ఈ కటౌట్‌ను ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని బీజేపీ కార్యాలయం ముందు పెడతారు. అంతేకాదు, మోదీ పుట్టినరోజు నాడు కటౌట్‌తో పాటు 1,500 కేజీల లడ్డూను, 105 కేజీల బెల్‌ను కూడా ప్రదర్శించనున్నారు. ఆయన దుబాయిలో పెయింటింగ్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. ఇప్పుడు మోదీ కటౌట్‌ను తయారు చేద్దామని లక్నోకి వచ్చారు. గతంలోనూ పలువురు నాయకుల భారీ కటౌట్‌లను తయారు చేసిన అనుభవం ఈయనకు ఉంది.