: ఏపీ బీజేపీ అధ్యక్షుడి రేసులో ముగ్గురు నేతలు!
2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ ఏ ఒక్క చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పాగా వేసిన బీజేపీ... దక్షిణాదిలో కూడా తనకు చేతనైనంత మేర పట్టు సాధించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో, ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి వేటను ప్రారంభించింది. సార్వత్రిక ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేయగల, సమర్థత గల నేతను ఎంపిక చేసే పనిలో పడింది.
ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్షుడి రేసులో సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ, కన్నా లక్ష్మి నారాయణల పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు, కాపు నేతకు ఈసారి అవకాశం ఇవ్వాలనే యోచనలో కూడా హైకమాండ్ ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, కాపు కులానికి చెందిన కన్నా లక్ష్మినారాయణకు అధ్యక్ష పదవి దక్కే అవకాశాలున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.