: వైసీపీ ఎమ్మెల్యే రోజా సైలెన్స్ కు కారణం ఇదేనా?


నిరంతరం అధికార పార్టీపైన, ముఖ్యమంత్రి చంద్రబాబుపైన విమర్శలతో చెలరేగి పోయే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా గత కొన్ని రోజులుగా సైలెంట్ అయిపోయారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల తర్వాత ఆమె మీడియా ముందుకు వచ్చింది కూడా తక్కువే. దీనికి వైసీపీ అధిష్ఠానమే కారణమని చెప్పుకుంటున్నారు. ఎన్నికలలో వ్యతిరేక ఫలితాలు రావడానికి రోజా చేసిన వ్యాఖ్యలే కారణమని వైసీపీ హైకమాండ్ భావిస్తోందట.

ప్రచారం సందర్భంగా అభ్యంతరకర పదజాలాన్ని వాడటమే కాకుండా, మంత్రి అఖిలప్రియ చుడీదార్లపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైసీపీకి ఓట్లను దూరం చేశాయనే భావన పార్టీ నేతల్లో ఉందట. ఈ నేపథ్యంలో, కొంతకాలం పాటు సైలెంట్ గా ఉండాలంటూ పార్టీ హైకమాండ్ ఆమెకు సూచించిందట. ప్రస్తుతం ఆమె తన నియోజకవర్గం నగరిపైనే ఫోకస్ పెట్టారు. నవరత్నాలు సభలు, వైయస్సార్ కుటుంబం వంటి కార్యక్రమాలతో ఆమె బిజీగా ఉన్నారు.

  • Loading...

More Telugu News