: జైల్లో శశికళ రాజభోగాలకు మరో ఆధారం!


అన్నాడీఎంకే పార్టీ బహిష్కృత ప్రధాన కార్యదర్శి శశికళ పరప్పణ అగ్రహార జైల్లో రాజభోగాలు అనుభవించిన సంగతి తెలిసిందే. ఆమె అనుభవించిన భోగాలకు సంబంధించి తాజాగా మరో ఆధారం వెలుగుచూసింది. వాస్తవానికి శిక్షను అనుభవిస్తున్న వారెవరైనా... జైల్లో వారికి అప్పగించిన పనిని చేయాలి. కానీ, శశికళకు మాత్రం జైలు అధికారులు దీన్నుంచి మినహాయింపును ఇచ్చారు. ఆమెకు ఏ పనీ అప్పగించకుండా, తమ విధేయతను ప్రదర్శించుకున్నారు. ఆర్టీఐ రిపోర్ట్ లో ఇది వెల్లడయింది. అయితే, ఆమెకు ఏ స్థాయి వసతులు కల్పిస్తున్నారనే విషయంలో మాత్రం ఆర్టీఐ రిపోర్ట్ స్పష్టతనివ్వలేదు. శశికళను ఇప్పటి వరకు 24 మంది జైల్లో కలిశారట.  

  • Loading...

More Telugu News