: 'సాక్షర భారత్' అమలుపై చంద్రబాబు నాయుడికి రఘువీరారెడ్డి లేఖ!


కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో సాక్షర భారత్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, 2010లో ఏపీలో ఆ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించి కాంట్రాక్ట్ ప్రాతిప‌దికన 504 మంది మండ‌ల కో అర్డినేట‌ర్ల‌ను, 19, 958 మంది గ్రామ కో ఆర్డినేట‌ర్ల‌ను నియ‌మించింద‌ని ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి చెప్పారు. అయితే, ప్ర‌స్తుతం వారిపై ప‌ని భారం ఎక్కువ‌గా వేస్తున్నార‌ని తెలుపుతూ ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడికి లేఖ రాశారు. సుప్రీంకోర్టు తీర్పును అనుస‌రించి స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం ఇవ్వాల‌ని, జీవో నెంబ‌ర్ 151ని అమ‌లు చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.



  • Loading...

More Telugu News