: శాలినీని బాధించిన జ్వరం, తీవ్ర తలనొప్పి... కోలుకున్న 'అర్జున్ రెడ్డి' హీరోయిన్
ఈ ఉదయం నెల్లూరులో ఓ సెల్ ఫోన్ షాపు ప్రారంభోత్సవానికి 'అర్జున్ రెడ్డి' చిత్ర హీరోయిన్ శాలినీ పాండే వచ్చి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఆమె అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి కారణంగా షోరూములో సొమ్మసిల్లి పడిపోయిందని, వెంటనే నగరంలోని అత్యాధునిక ఆసుపత్రికి తరలించామని షోరూమ్ నిర్వాహకులు తెలిపారు. కొంతసేపు ఐసీయూలో ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం ఆమె కోలుకున్నారని, కాసేపటికి ఆమెను డిశ్చార్జ్ చేశామని బొల్లినేని మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. శాలినీ పాండే వస్తున్నారని తెలిసి భారీ సంఖ్యలో అభిమానులు షాపు వద్దకు వచ్చారని, అభిమానుల తాకిడికి తోడు ఎండ అధికంగా ఉండటం కూడా ఆమె అస్వస్థతకు కారణమని తెలుస్తోంది.