: నవంబర్ 15 నుంచి ఇంటింటికీ... ఏపీ కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ ఇదే!


రాష్ట్ర విభజన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ లో దాదాపు కనుమరుగైన కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. మళ్లీ జవసత్వాలను కూడగట్టుకునేందుకు వ్యూహాలను రచిస్తోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు ఇతర కీలకనేతల సమావేశంలో ఈ మేరకు చర్చ జరిగింది. అనంతరం పలు నిర్ణయాలను తీసుకున్నారు.

ఇందిరమ్మ శత జయంతి ఉత్సవాల పేరిట అక్టోబర్ 2వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ తిరిగి... పేదలకు కాంగ్రెస్ హయాంలో అందిన ఫలాలను వివరించాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్టీ డీసీసీ, అనుబంధ సంఘాల ఎన్నికల ప్రక్రియ 80 శాతం మేర పూర్తయిందని... మిగిలిన ప్రక్రియను కూడా నెలాఖరులోగా పూర్తి చేయాలని తీర్మానించారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ తో పాటు మిగిలిన పదవులను కూడా ఎంపిక చేయాలని నిర్ణయించారు. రానున్న రోజుల్లో ప్రజలతో పూర్తిగా మమేకం కావాలని నిర్ణయం తీసుకున్నారు. 

  • Loading...

More Telugu News