: ఎనిమిది జిల్లాలు తిరిగాను... ఇలా ఎవరూ కలవలేదు!: వైకాపా మహిళా సర్పంచ్ తో నారా లోకేశ్
ఇంటింటికీ తెలుగుదేశం పార్టీలో భాగంగా విజయనగరం జిల్లా, కొత్తవలసలో మంత్రి నారా లోకేశ్ పర్యటిస్తున్న వేళ ఆసక్తికర ఘటన ఒకటి జరిగింది. తమ పంచాయితీకి అభివృద్ధి నిధులు అందించాలంటూ సర్పంచ్ గోరేపల్లి అలేఖ్య ఓ వినతిపత్రాన్ని ఇచ్చారు. ఆపై ఆమె వైకాపాకు చెందిన సర్పంచ్ అని, ఆ పార్టీలో స్థానిక మహిళా నేతని తెలుసుకున్న లోకేశ్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. "నేను ఇప్పటి వరకూ ఎనిమిది జిల్లాల్లో పర్యటించాను. ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారు అభివృద్ధి కావాలంటూ ఇలా ఎవరూ నన్ను కలవలేదు. పార్టీలకు అతీతంగా అభివృద్ధిని కోరుకోవడం శుభపరిణామం" అని అన్నారు. అలేఖ్యను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.