: అనిల్ కపూర్ వేషధారణలో ఉన్నది ఎవరో గుర్తుపట్టండి?.... నెటిజన్లకు ఫరాఖాన్ ప్రశ్న!
కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరాఖాన్ తన ఇన్స్టాగ్రాం అకౌంట్లో ఓ ఫొటో పోస్ట్ చేసింది. అనిల్ కపూర్ వేషధారణలో ఉన్నది ఎవరో? కనిపెట్టాలని ఆమె నెటిజన్లను అడిగింది. అయితే కొంత మంది నెటిజన్లు మాత్రమే ఆ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తించగలిగారు. త్వరలో ప్రారంభం కానున్న ఫరాఖాన్ కొత్త టీవీ షో `లిప్ సింగ్ బ్యాటిల్` కార్యక్రమం షూటింగ్లో భాగంగా మేకప్ రూంలో ఈ ఫొటో తీశారు.
ఇందులో అనిల్ కపూర్ వేషధారణలో ఉన్నది ప్రముఖ నటి రవీనా టాండన్. ఇంగ్లీష్‌లో ప్రసారమయ్యే `లిప్ సింక్ బ్యాటిల్` కార్యక్రమం ఆధారంగా హిందీలో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. దీనికి ఫరాఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ఇందులో ఇద్దరు సెలబ్రిటీలు కొన్ని పాటలకు స్టెప్పులేస్తూ, పాటల్లో నటించిన వారి వేషధారణలో పెదవులు కదుపుతుంటారు. అందులో భాగంగానే రవీనా టాండన్, అనిల్ కపూర్ వేషం వేసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కార్యక్రమంలో పరిణీతి చోప్రా, కరణ్ జొహార్, అర్జున్ కపూర్, ఫర్హాన్ అక్తర్‌లు పాల్గొన్నట్లు సమాచారం.