: మంత్రి పదవిని కూడా వదులుకుని జగన్ వెంట నడిచాను.. ఈ వార్తలు బాధాకరం: బాలినేని శ్రీనివాసరెడ్డి


వైసీపీలో ప్రధాన నేతల్లో ఒకరైన ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. మంత్రి పదవిని సైతం వదులుకుని తాను జగన్ వెంట నడిచానని... అలాంటిది, పార్టీని ఎందుకు వీడుతానని అన్నారు. ఈ వార్తలు తనను బాధించాయని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో సైతం తాను వైసీపీ నుంచే పోటీ చేస్తానని చెప్పారు. మరోసారి సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టింగులు పెట్టేవారిని తాను ఉపేక్షించబోనని తెలిపారు. ఇలాంటి పుకార్లతో పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందవద్దని అన్నారు. ఒంగోలు నియోజకవర్గ వైసీపీ డివిజన్ అధ్యక్ష, బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News