: 'చంద్రబాబునాయుడు అను నేను...!' అంటూ ప్రతిజ్ఞ చేసిన ముఖ్యమంత్రి!


నదుల పరిరక్షణ నిమిత్తం ప్రతి ఒక్కరూ కట్టుబడి వుండాలని చెబుతూ, 'ర్యాలీ ఫర్ రివర్స్' కార్యక్రమానికి హాజరైన వారితో చంద్రబాబునాయుడు ప్రతిజ్ఞ చేయించారు. తాను 'డ్యాష్' అని చెబుతానని, 'డ్యాష్' చెప్పిన చోట ప్రతి ఒక్కరూ తమ పేరు తాము చెప్పుకోవాలని అన్నారు. తన పేరు చెప్పి బాధ్యతంతా తనపై వేయవద్దని చమత్కరించారు. ఆపై ప్రతిజ్ఞ చేయించారు.

"చంద్రబాబునాయుడు అను నేను, సకల జీవరాసుల మనుగడకు జలరాసులే ప్రాణాధారమని గుర్తించి, ప్రతి నీటి బిందువును, నా ఆత్మ బంధువుగా భావించి, నీటిని పొదుపుగా వాడుతానని, భావితరాల వారి కోసం జల సంరక్షణ చేస్తూ, కరువు రహిత రాష్ట్ర నిర్మాణం కోసం పాటు పడతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను" థ్యాంక్యూ, ధన్యవాదాలు అంటూ ప్రసంగాన్ని ముగించారు.

  • Loading...

More Telugu News