: ఐఫోన్ పదేళ్ల కానుక 'ఎక్స్' వచ్చేసింది... ధర, స్పెసిఫికేషన్స్
కొత్త యాపిల్ ఐఫోన్ వచ్చేసింది. సంస్థను ప్రారంభించి పదేళ్లు అయిన సందర్భంగా ఐఫోన్ టెన్ ఎక్స్ ను యాపిల్ సీఈఓ టిమ్ కుక్ విడుదల చేశారు. ఈ ఫోన్ పేరు ఐఫోన్ 8 అని ఉంటుందని ఊహించగా, పదో వార్షికోత్సవం కాబట్టి దీని పేరును టెన్ గా పెట్టారు. సరిగ్గా పదేళ్ల క్రితం స్టీవ్ జాబ్స్ తొలి ఐ ఫోన్ ను ఆవిష్కరించారని గుర్తు చేసిన టిమ్ కుక్, కొత్త ఫోన్ నవంబర్ 3 నుంచి అమెరికా సహా పలు దేశాల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ఈ ఫోన్ ను ముఖానికి ఎదురుగా ఉంచుకుని కళ్లతో చూడటం ద్వారా అన్ లాక్ అవుతుందని, వైర్ లెస్ చార్జింగ్ దీని ప్రత్యేకతని తెలిపారు. ఇదే సమయంలో మరింత మెరుగుపరిచిన 7, 7 ప్లస్ వేరియంట్లను 8, 8 ప్లస్ పేరిట విడుదల చేస్తున్నట్టు పేర్కొన్నారు. 7 వేరియంట్ ధరలను తగ్గిస్తున్నట్టు టిమ్ కుక్ వెల్లడించారు. ఇక ఐఫోన్ టెన్ ఎక్స్ లో 5.8 అంగుళాల స్క్రీన్, 3డీ సెన్సార్లు, 12 ఎంపీ డ్యూయల్ కెమెరాలు, కనీసం 64 జీబీ అంతర్గత మెమొరీ తదితర సదుపాయాలున్నాయి. దీని ధరను రూ. 999 డాలర్లుగా నిర్ణయించారు. ఈ ఫోన్లను 15 నుంచి ప్రీ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా యాపిల్ వాచ్ 3, 4కే యాపిల్ టీవీలను కూడా ఆయన మార్కెట్లోకి విడుదల చేశారు.