: మహబూబ్‌నగర్‌లో స్వైన్‌ఫ్లూ కలకలం.. నలుగురు విద్యార్థులకు వ్యాధి లక్షణాలు
మహబూబ్‌నగర్‌ను స్వైన్‌ఫ్లూ భయపెడుతోంది. నగరంలోని అంధుల పాఠశాలలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులకు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. దీంతో వారిని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇతర విద్యార్థులకు వ్యాధి సోకకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఈ విషయమై వైద్యాధికారుల నుంచి అధికారకంగా ఎటువంటి ప్రకటన లేదు. మరోవైపు స్వైన్ ఫ్లూ విషయం తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రభుత్వం సత్వరం నివారణ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.