: భయంతో మరణించిన కోతులు.. పెద్ద పులి గాండ్రింపులే కారణం!


అవును! భయంతోనే కోతులు మరణించాయి. ఈ విషయాన్ని వైద్యులు నిర్ధారించారు. ఉత్తర భారతదేశంలోని ఓ అటవీ ప్రాంతంలో కోతుల మృతదేహాలు గుట్టగా పడి ఉన్నాయి. వీటిని గుర్తించిన గిరిజనులు పోలీసులకు సమాచారం అందించారు. పరిశీలించిన వారు వాటికి ఎవరో విషం పెట్టి చంపేసి ఉంటారని భావించారు. అయితే వైద్య పరీక్షల్లో మాత్రం అవి భయంతో మరణించినట్టు తేలింది. మొత్తం 12 వానరాలు చనిపోయాయి. మరణానికి ముందు అవి తీవ్రమైన భయాన్ని అనుభవించాయని పరీక్షల్లో బయటపడింది. పెద్ద పులి గాండ్రింపులు విని, ఆ భయంతోనే అవి మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

  • Loading...

More Telugu News