: జపాన్ ప్రధాని షింజోతో కలసి మోదీ గుజరాత్ పర్యటన... 9000 మంది పోలీసుల పహారా!
రేపు, ఎల్లుండి భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. ఇండో-జపాన్ వార్షిక సదస్సుతో పాటు పలు కార్యక్రమాల్లో వారు పాల్గొంటారు. అనంతరం మోదీ, షింజే అబే కలిసి సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శిస్తారు. దీంతో ఆ నగరంలో మొత్తం 9000 మందికి పైగా పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా పోలీసులను రప్పించామని పోలీసు అధికారులు తెలిపారు. రాష్ట్ర రిజర్వ్ పోలీస్‌కు చెందిన 12 కంపెనీల బలగాలతో పాటు బాంబ్ స్క్వాడ్, క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను రంగంలోకి దించుతున్నామని తెలిపారు.