: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపై వేట కొడవళ్లతో దాడి.. ప్రాణాలు కోల్పోయిన భర్త
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులపై కొందరు దుండగులు వేట కొడవళ్లతో దాడి చేసిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం నాగసాలలో కలకలం రేపింది. ఈ ఘటనలో భర్త అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, భార్యకు తీవ్రగాయాలయ్యాయి. దుండగులు ఆటోలో వచ్చి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ దంపతులపై మొత్తం నలుగురు దాడి చేశారని పోలీసులు తెలుసుకున్నారు. గాయాలపాలయిన మహిళను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆ దంపతులు నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట మండల కేంద్రానికి చెందిన వెంకటయ్య, సుజాతగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.