: అర్ధరాత్రి సమయంలో ఓ యువతి ఫోన్ చేసి వేధిస్తోందంటూ హైదరాబాద్ యువకుడి ఫిర్యాదు!
ఓ యువతి తనకు ఫోన్ చేసి వేధిస్తోందని ఓ యువకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంఘటన హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. రోడ్ నంబర్ -14లో నివసించే సతీష్ అనే యువకుడు వ్యాపారం చేసుకుంటున్నాడు. ఆయనకు ఏకంగా రెండేళ్ల నుంచి ఫోన్‌లో నెట్ కాలింగ్ ద్వారా అర్ధరాత్రి సమయంలో ఓ యువతి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. తనకు డబ్బు ఇవ్వాలని, లేకపోతే పరువు తీస్తానని ఆ యువతి బెదిరిస్తోంది. గుర్తు తెలియని ఆ యువతి చేష్టలతో ఇబ్బంది పడుతోన్న ఆ యువకుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఆ యువతిపై సెక్షన్ 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.