: బ్లూవేల్ గేమ్ బారినపడ్డ బాలుడిని గుర్తించిన స్నేహితులు.. ఆసుపత్రిలో చికిత్స
ఒడిశాలోని బలాసోర్ జిల్లా జలేశ్వర్‌లో ఐటీఐ చదువుకుంటూ తన స్నేహితులతో ఉంటోన్న ఓ 17 ఏళ్ల బాలుడు బ్లూ వేల్ ఆన్‌లైన్ గేమ్ బారిన పడ్డాడు. కొన్ని రోజులుగా ఆ బాలుడు ఎవరితోనూ మాట్లాడకుండా, డిప్రెషన్‌లో ఉంటున్నాడు. ఆ బాలుడిలో వచ్చిన మార్పులను గుర్తించిన అతడి స్నేహితులు తమ ప్రిన్సిపాల్ కు ఈ విషయాన్ని చెప్పారు. కొన్ని రోజుల ముందు తమతో ఆ బాలుడు బ్లూ వేల్ గేమ్ గురించి చెప్పాడని అతడి స్నేహితులు తెలిపారు. దీంతో వెంటనే ఆ ప్రిన్సిపాల్ పోలీసులకు ఈ విషయంపై సమాచారం ఇచ్చారు. ఆ బాలుడిని పోలీసులు ఆసుపత్రిలో చేర్చించారు. అతడి శరీరంపై ఎటువంటి గాయాలు లేవని అన్నారు. ఈ విషయాన్ని పోలీసులు ఆ బాలుడి తల్లిదండ్రులకు తెలియజేశారు.