: చంద్రబాబుతో నేను రాజకీయాల గురించి మాట్లాడలేదు: లగడపాటి రాజగోపాల్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కాంగ్రెస్ పార్టీ మాజీ నేత లగడపాటి రాజగోపాల్ కలిసిన నేపథ్యంలో ఎన్నో పుకార్లు షికారు చేస్తున్నాయి. దీంతో లగడపాటి ఈ రోజు ఈ విషయంపై స్పందించారు. తాను వ్యక్తిగతంగానే చంద్రబాబుని కలిశానని, చంద్రబాబుతో నంద్యాల సహా ఏ రాజకీయ అంశం గురించి మాట్లాడలేదని లగడపాటి అన్నారు. తాను రాజకీయాలకి దూరంగా ఉంటానని గతంలోనే స్పష్టం చేశానని, ఇప్పటికీ అదే మాటపై నిలబడి ఉన్నానని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు సఖ్యతతో మెలగడం శుభపరిణామమని పేర్కొన్నారు.