: ‘మన లోక్‌సభ సీట్ల సంఖ్య 546’.. మరోసారి తడబడి మాట్లాడిన రాహుల్ గాంధీ
తమ పార్టీ నిర్వహిస్తోన్న బహిరంగ సభల్లో పాల్గొని మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నోసార్లు తడబడి మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు మరోసారి తప్పులో కాలేశారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. భారత లోక్‌సభలో సీట్ల సంఖ్య 546 అని చెప్పారు. వాస్తవానికి లోక్‌సభలో రెండు నామినేటెడ్ సీట్లతో కలిపి మొత్తం 545 స్థానాలు ఉంటాయి. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్య సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇంత ముఖ్యమైన విషయం తెలియని రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దేశానికి ప్రధాని కావాలని కోరుకుంటున్నారని సెటైర్లు వేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రసంగంలో కనీసం ఒక్క తప్పయినా ఉంటుందని అంటున్నారు.