: సెల్ ఫోన్ల వినియోగంలో మనది నాలుగోస్థానం
దేశం మొత్తమ్మీద సెల్ ఫోన్ల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ నాలుగోస్థానంలో ఉంది. కాగా, ఉత్తరప్రదేశ్ మొబైల్ కనెక్షన్ల విషయంలో ప్రథమస్థానంలో ఉంది. ఇక రెండు మూడు స్థానాల్లో తమిళనాడు, మహారాష్ట్ర, ఐదోస్థానంలో బీహార్ ఉన్నాయి. కాగా, దేశంలో మొబైల్ కనెక్షన్ల సంఖ్య 861.66 మిలియన్లకు చేరింది. ఒక్క యూపీలోనే 121 మిలియన్ల కనెక్షన్లు ఉన్నాయి.