: నంద్యాల‌, కాకినాడ‌లో జ‌రిగిన ఎన్నిక‌లు ఎన్నిక‌లే కాదు!: ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి


దేశానికి భార‌తీయ జ‌న‌తా పార్టీ చాలా ప్ర‌మాద‌క‌రమ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి అన్నారు. అలాగే టీడీపీ- వైసీపీ రెండూ బీజేపీ అనుబంధ‌ సంస్థ‌లని వ్యాఖ్యానించారు. విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ కార్యాల‌యంలో ఈ రోజు మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ఆయా పార్టీల నేత‌లు ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేశారని అన్నారు. నంద్యాల‌, కాకినాడ‌లో జ‌రిగిన ఎన్నిక‌లు ఎన్నిక‌లే కాదని అన్నారు. అవి పూర్తిగా అనైతికంగా జ‌రిగాయని అన్నారు. ఇందులో ఎల‌క్ష‌న్ క‌మిష‌న్ ఘోరంగా విఫ‌లం చెందింద‌న్నారు. రాష్ట్రానికి, దేశానికి కాంగ్రెస్ పార్టీయే ప్ర‌త్యామ్నాయం అనే విధంగా తాము ప‌ని చేస్తామ‌న్నారు.

  • Loading...

More Telugu News