: కుల్ భూషణ్ జాదవ్ కేసులో రేపు భారత్, పాక్ వాదనలు విననున్న అంతర్జాతీయ న్యాయస్థానం
గూఢచర్యం ఆరోపణలు మోపుతూ భారత నేవీ మాజీ అధికారి కుల్ భూషణ్ జాదవ్‌కి పాకిస్థాన్ ఆర్మీ కోర్టు మరణశిక్ష విధించాలని తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లి ఆ మరణశిక్షపై భారత్ స్టే తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో రేపు అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ కేసు మరోసారి విచారణకు రానుంది. రేపు ఆ న్యాయస్థానంలో పాకిస్థాన్, భారత్ తమ వాదనలు వినిపించనున్నాయి. ఈ కేసులో ఇరు దేశాలు తాము చేస్తోన్న వాదనలపై ఆధారాలు సమర్పించాక వాటిని పరిశీలించి అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఏడాది డిసెంబరులో తుది తీర్పు ఇవ్వనుంది.