: రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకున్న క్రికెటర్ సురేశ్ రైనా

టీమిండియా ఆటగాడు సురేశ్ రైనా ఢిల్లీ నుంచి కాన్పూర్‌కు వస్తుండగా ఆయన కారు టైరు పేలింది. రైనా వెంటనే తన కారును అదుపు చేయడంతో ఆయనకు త్రుటిలో ప్రమాదం తప్పింది. ఐత్వా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో రైనా కారు నిదానంగా నడపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ కారుకి అదనపు టైరు లేకపోవడంతో పోలీసుల సాయంతో ఆయన వేరే వాహనంలో అక్కడి నుంచి వెళ్లాడు. ప్రమాదానికి గురైన రైనా కారు ప్రస్తుతం పోలీసులు అధీనంలో ఉంది. దులీప్ ట్రోఫీ కోసం రైనా ఢిల్లీకి వెళ్లాడు. అది ముగియడంతో తిరిగి ఇంటికి వెళుతోన్న క్రమంలో ఈ ఘటన జరిగింది.