: తెలంగాణలో రేపటి నుంచి కొత్త మద్యం విధానానికి దరఖాస్తులు.. వివరాలు వెల్లడి
తెలంగాణలో రేపటి నుంచి కొత్త మద్యం విధానానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుందని ఆబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేశ్ కుమార్ ఈ రోజు ప్రకటన చేశారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 19 వరకు కొనసాగుతుందని చెప్పారు. ఈ సారి దరఖాస్తు రుసుంను రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచుతున్నట్లు చెప్పారు. అక్టోబర్ 1 నుంచి కొత్త దుకాణాలు ప్రారంభమవుతాయని అన్నారు. అలాగే హైదరాబాద్‌లో మద్యం దుకాణాలు తెరచి ఉంచే సమయాన్ని రాత్రి 11 గంటల వరకు పొడిగిస్తున్నామని చెప్పారు. రెండేళ్ల పాటు ఈ విధానమే అమలులో ఉంటుందని అన్నారు. దుకాణాల సంఖ్యలో మార్పులేదని చెప్పారు. అలాగే ప్రతీ మద్యం దుకాణాల ముందు రెండు సీసీ కెమెరాలు ఉంచాలని, వాటిని ఆబ్కారీ శాఖ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయించుకోవాలని అన్నారు.