: ఓవరాల్ వరల్డ్ కప్ చరిత్రలో భారత జట్టుకు అతినీచమైన సమయం అదే!: సచిన్


ఓవరాల్ వరల్డ్ కప్ చరిత్రలో భారత జట్టుకు అతినీచమైన సమయం 2007 అని టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అన్నాడు. అప్పుడు జరిగిన ప్రపంచ కప్ లో టీమిండియా కనీసం సూపర్-8 స్టేజ్ కు కూడా అర్హత కాలేకపోయిందని తెలిపాడు. ఆ ప్ర‌పంచ‌క‌ప్‌లో బంగ్లాదేశ్, శ్రీలంకలతో జరిగిన మ్యాచ్ లను కూడా ఓడిపోయామ‌ని గుర్తు తెచ్చుకున్నాడు. ఆ సమయంలో భారత క్రికెట్ లో ఏం జరుగుతుందో అర్థం కాలేద‌ని వ్యాఖ్యానించాడు.

ఆ స‌మ‌యంలో ఏదో ఆడుకుంటూ వెళ్లామ‌ని, సరైన మార్గదర్శకత్వంలో ఆడుతున్నట్లు కనిపించలేదని సచిన్ వాపోయాడు. ఆ తరువాత టీమిండియాలో ఎన్నో మార్పులు అనివార్యమయ్యాయని చెప్పాడు. ఎన్నో ప్ర‌ణాళిక‌లు వేసుకుని ఆడామ‌ని వ్యాఖ్యానించాడు. త‌న క్రికెట్ కెరీర్‌లో 2011 వరల్డ్ కప్ మ‌ర్చిపోలేనిద‌ని అన్నాడు.

  • Loading...

More Telugu News