: నెట్ లేకపోయినా ఫేస్ బుక్ లో వీడియోలు చూసుకునే సదుపాయం!
ఇంటర్నెట్ సౌకర్యంలేని సమయంలోనూ ఫేస్‌బుక్‌లో వీడియోలు చూసుకునే సదుపాయం త్వరలోనే మనకు కలగనుంది. ఇప్పటికే యూ ట్యూబ్‌లో ఆఫ్‌లైన్ వీడియో సదుపాయం అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇదే తరహాలో వైఫై పరిధిలో మీ మొబైల్ ఉన్నప్పుడు మీ ఫేస్‌బుక్ యాప్‌లో కొన్ని వీడియోలు డౌన్‌లోడ్ అవుతాయి. అనంతరం ఎప్పుడైనా ఆ వీడియోలను నెట్ కనెక్షన్ లేకుండానే చూడవచ్చు. యూజర్ల ప్రమేయం లేకుండానే ఈ వీడియోలు డౌన్‌లోడ్ అవుతాయి. ఏయే వీడియోలు ఆఫ్‌లైన్‌లోకి వెళ్లాలనేది మాత్రం యూజర్లు ఎంచుకున్న ప్రాధాన్యాలను బట్టే కొనసాగుతుంది.