: ప్రపంచంలో పొడవైన చేతిగోర్లతో గిన్నిస్ రికార్డ్... వీడియో చూడండి!
అమెరికాలో టెక్సాస్‌లోని హ్యూస్టన్ ప్రాంతానికి చెందిన అయానా విలియమ్స్ ప్రపంచంలోనే పొడవైన చేతి గోర్లు గల మహిళగా గిన్నిస్ రికార్డు సృష్టించింది. గత 23 ఏళ్లుగా ఆమె చేతి గోర్లను పెంచుతోంది. రెండు చేతి వేళ్ల గోర్ల మొత్తం పొడవు 18 అడుగుల వరకు ఉంది. మరీ ప్రత్యేకంగా చెప్పాలంటే ఆమె ఎడమ బొటన వేలి గోరు పొడవు, ప్రపంచంలోనే తక్కువ ఎత్తు ఉన్న చంద్ర బహదూర్ కంటే పొడవు ఉంది. చంద్ర బహదూర్ ఎత్తు 1 అడుగు 9.5 అంగుళాలు. అయానా గోరు పొడవు 2 అడుగుల 2.7 అంగుళాలు.
`నా గోర్లు నా శరీరంలో భాగం. అందుకే వాటిని కత్తిరించాలని నేను అనుకులేదు` అని అయానా చెబుతోంది. ఇంత పొడవైన గోర్లు, తెగిపోకుండా రోజువారీ కార్యక్రమాలను చేయడానికి అయానా చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. నెయిల్ ఆర్టిస్ట్‌గా పనిచేస్తున్న అయానా తన గోర్లకు పాలిష్ చేసి, పెయింట్ వేయడానికి దాదాపు 20 గంటల సమయం, రెండు బాటిళ్ల నెయిల్ పాలిష్ అవసరమవుతాయని పేర్కొంది. అయానాకు సంబంధించిన ఓ వీడియో గిన్నిస్ బృందం ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. ఇప్పటికే ఈ వీడియోను 40 లక్షల మంది వీక్షించారు.