: మెట్రోరైలు ఎక్కేసి.. హల్ చల్ చేసిన కోతి... మీరూ చూడండి!
ఓ కోతి మెట్రోరైలు ఎక్కేసి, అందులో ప్రయాణించిన ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆ ట్రైన్ కోసం బాటా చౌక్ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికులు ఎదురు చూస్తున్నారు. అది రాగానే అంతా అందులో ఎక్కేశారు. అయితే, అదే సమయంలో ఓ కోతి కూడా ఎక్కేసింది. రైల్లో హుషారుగా అటూ ఇటూ తిరుగుతూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది. అయినప్పటికీ, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం రైల్లోకి కోతి రాలేదని అంటున్నారు. రైల్లోకి జంతువులు ప్రవేశిస్తున్నాయని, అవి మనుషులకు హాని చేస్తే పరిస్థితి ఏంటని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.