: చాందిని హత్య కేసులో పలు సందేహాలు...!


 బాచుపల్లిలోని కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న చాందిన ఈ నెల 6న కళాశాలకు వెళ్లి స్నేహితులతో పార్టీకి వెళ్తున్నానని చెప్పి తిరిగి ఇంటికి రాలేదు. అయితే అమీన్ పూర్ గుట్టల్లో ఆమె మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో చాందిని హత్య వెలుగు చూసింది. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సీసీ పుటేజ్ ను పరిశీలిస్తున్నారు. అందులో చాందిని ఆగంతుకుడితో ఆటోలో వెళ్లింది. ఈ నేపథ్యంలో విచారించగా అమీన్ పూర్ గుట్టలవైపు చాందిని ముగ్గురు యువకులతో కలిసి సాయంత్రం సమయంలో వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. అమీన్‌ పూర్ గుట్టకు మద్యం ప్రియులకు, అసాంఘిక కార్యకలాపాలకు నెలవు.

ఉదయం 11 గంటల నుంచే ఇక్కడ మద్యం ప్రియులు సిట్టింగ్ వేసేస్తారు.  సమయం దాటిందంటే చాలు ఈ గుట్టకు మద్యం ప్రియులు బారులు తీరుతారు. ఇక్కడి గుట్టలను ఆనుకుని వున్న ఒక అపార్ట్‌ మెంట్ నుంచి, మదీనగూడలోని హుండాయ్ షోరూమ్ తో పాటు ఆ రోడ్డులోని సీసీటీవీ పుటేజ్ ను పోలీసులు సేకరించారు. దీంతో చాందినితో ఉన్న యువకులెవరు? అన్న దానిపై ఆరాతీయడం ఆరంభించారు. ఆమె వారితో వెళ్లిందా? లేక కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా? అక్కడికి తీసుకెళ్లి హతమార్చారా? హతమార్చి అక్కడికి తీసుకెళ్లారా? అన్నది దర్యాప్తు చేస్తున్నారు. చాందిని మృతదేహాం లభించిన చోట మద్యం బాటిళ్లు లభ్యం కావడంతో వాటి లేబుళ్లు సేకరించి, అవి ఎక్కడ? ఎవరు? కొన్నారన్న విషయాన్ని ఆరాతీస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ కేసును ఛేదిస్తామని చెబుతున్నారు. చాందిని ఫోన్ లో ఉన్న నలుగురి కాంటాక్ట్స్ ఆధారంగా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

  • Loading...

More Telugu News