: చాందినీ జైన్ తల, మెడపై కొట్టి దారుణంగా చంపారు: వైద్య వర్గాల వెల్లడి
రెండు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమై, ఆపై అమీన్ పూర్ కొండల్లో విగతజీవిగా కనిపించిన ఇంటర్ విద్యార్థిని చాందినీ జైన్ పోస్టుమార్టం కొద్దిసేపటి క్రితం గాంధీ ఆసుపత్రిలో ముగిసింది. ఆమె మెడ, తలపై బలమైన గాయాలున్నాయని, చెంపలపై కొరికిన గాట్లు ఉన్నాయని వైద్య వర్గాలు వెల్లడించాయి. బలమైన గాయాలు తగలడం వల్లే ఆమె మరణించిందని, అత్యాచారం జరిగిందా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు శాంపిల్స్ సేకరించామని వైద్యులు తెలిపారు. కాగా, ఈ కేసులో చాందినీ ఫోన్ నుంచి కాల్స్ వెళ్లిన నలుగురు స్నేహితుల్లో ఇద్దరిని అనుమానిస్తున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.