: ఫుట్సల్ జట్లకు ఫ్రాంచైజీగా దగ్గుబాటి రానా, సన్నీ లియోన్
ఇండోర్‌లో ఆడే ఫుట్‌బాల్ క్రీడ `ఫుట్సల్` సీజన్ 2లో రెండు జట్లకు ఫ్రాంచైజీలుగా టాలీవుడ్ స్టార్ రానా, బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్‌లు వ్యవహరించనున్నారు. సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానున్న ఈ ఫుట్సల్ క్రీడల్లో తెలుగు టైగర్స్ జట్టుకు రానా యజమానిగా ఉంటుండగా, కేరళ కోబ్రాస్ జట్టును సన్నీ లియోన్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. గతంలో జరిగిన ఫుట్సల్ మొదటి సీజన్‌కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ రావడంతో ఈసారి సీజన్‌లో సినీనటులను ఫ్రాంచైజీలుగా రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఫ్రాంచైజీ ఆధారిత క్రీడలైన ఐపీఎల్, ప్రొ కబడ్డీ పోటీలకు మంచి ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. సెకండ్ సీజన్ ముంబై, బెంగళూరు నగరాల్లో జరగనుంది.