: తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎంఐఎంకు తాకట్టు పెట్టారు.. కాంగ్రెస్ కు పట్టిన గతే మీకూ పడుతుంది!: కేసీఆర్ పై బీజేపీ ఫైర్


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ధ్వజమెత్తారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుంటే... తెలంగాణ ప్రజలు సహించరని అన్నారు. తెలంగాణ ప్రజలు సాధించుకున్న తెలంగాణ... ఇప్పుడు కేసీఆర్ కుటుంబం చేతిలో బందీగా మారిందని మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మజ్లిస్ కు తాకట్టుపెడతామంటే ప్రజలు సహించరని అన్నారు. మజ్లిస్ చేతిలో టీఆర్ఎస్ కీలుబొమ్మలా మారిందని విమర్శించారు. విమోచన దినాన్ని నిర్వహించాలంటూ గతంలో కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేసిన కేసీఆర్... ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన తప్పిదాలనే ఇప్పుడు టీఆర్ఎస్ చేస్తోందని... కాంగ్రెస్ కు పట్టిన గతే టీఆర్ఎస్ కు పడుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News