: అదే జరిగి ఉంటే భూమి మాడి, మసైపోయుండేది!
ఇటీవల కాలంలో సూర్యుడి నుంచి విపరీతమైన వేడి, శక్తిమంతమైన కిరణాలు భూమ్మీదకు వస్తున్నాయి. తాజాగా సూర్యుడి నుంచి అత్యంత శక్తిమంతమైన కిరణాలు దాదాపు 48 గంటలపాటు విశ్వంలోకి ప్రసరించాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. స్వీడన్ లోని 'లా ప్లామా' అనే అత్యంత శక్తిమంతమైన టెలిస్కోప్ ద్వారా ఈ కిరణాల ప్రసారాన్ని సైంటిస్టులు కనిపెట్టారు. గత 12 సంవత్సరాల్లో ఇంతటి శక్తిమంతమైన కిరణాలను తాము చూడలేదని శాస్త్రవేత్తలు చెప్పారు.
వీటిని ఎక్స్ కేటగిరీ మంటలుగా వారు తెలిపారు. అయితే, ఈ కిరణాల శక్తిని మాత్రం శాస్త్రవేత్తలు సరిగ్గా అంచనా వేయలేక పోయారు. మరోవైపు వారు మాట్లాడుతూ, ఆ కిరణాలు నేరుగా భూమిని తాకి ఉంటే... ఈ పాటికి భూమి మాడి మసైపోయుండేదని చెప్పారు. ఎక్స్ కిరణాల శక్తి దాదాపు వెయ్యి హైడ్రోజన్ బాంబులకు సమానంగా ఉండొచ్చని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే, సూర్యుడి నుంచి వెలువడిన వేడి మాత్రం దాదాపు 12 హైడ్రోజన్ బాంబుల శక్తికి సమానంగా ఉండవచ్చని అంచనా వేశారు. సూర్యుడి నుంచి వెలువడే కిరణాలను ఓజోన్ పొర అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.