: కృష్ణమ్మకు భారీ వరద... ఒక్క రోజులో శ్రీశైలానికి 8 టీఎంసీల నీరు
ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మకు వరదనీరు పోటెత్తుతోంది. ఈ ఉదయం శ్రీశైలం జలాశయానికి 37,035 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదు కాగా, నిన్న 39 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వ, ప్రస్తుతం 47.29 టీఎంసీలకు పెరిగింది. ఆల్మట్టికి వస్తున్న 11,500 క్యూసెక్కులను, నారాయణపూర్ కు వస్తున్న 11 వేల క్యూసెక్కులను, జూరాలకు వస్తున్న 35 వేల క్యూసెక్కుల నీటిని ఓ వైపు కాలువలకు, మరోవైపు దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ కు మాత్రం ఈ సీజన్ లో ఇంకా వరదనీరు ఒక్క చుక్క కూడా రాని పరిస్థితి. శ్రీశైలం జలాశయం నిండాలంటే, మరో 165 టీఎంసీల వరద నీరు రావాల్సి వుంది. అయితే, దిగువన ఉన్న సాగర్ ఆయకట్టుకు, ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు శ్రీశైలం నుంచి 6 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.