: టీడీపీలోకి జంప్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్న వైకాపా నేత గురునాథరెడ్డి!


అనంతపురం వైకాపా నేతల మధ్య ఆధిపత్య పోరు మరింతగా రగులుతుండటంతో, ఆ పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే బోడిమల్లు గురునాథరెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటునట్టు తెలుస్తోంది. తన రాజకీయ భవిష్యత్తు బాగుండాలంటే, పార్టీ మారడం ఒక్కటే మార్గమని భావిస్తున్న ఆయన, తన మనసులోని మాటను సన్నిహితులతో పాటు పరిచయమున్న టీడీపీ నేతలకు చేరవేసినట్టు తెలుస్తోంది.

కాగా, అనంతపురం వైసీపీలో గత కొంతకాలంగా అంతర్యుర్థం నడుస్తోంది. తదుపరి ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం ఎక్కువ మంది పోటీలో ఉండటం, మాజీ ఎంపీ అనంత అసెంబ్లీ టికెట్ ను ఆశిస్తుండటం, సమన్వయకర్తగా తనను వదిలి నదీంకు బాధ్యతలు అప్పగించడం వంటి చర్యలు గురునాథరెడ్డికి ఆగ్రహాన్ని తెప్పించాయని తెలుస్తోంది. ఆయన టీడీపీలో చేరితే ఆ కుటుంబం మొత్తం పార్టీ మారిపోతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

వాస్తవానికి పరిటాల రవి కుటుంబంతో ఆదినుంచి గురునాథరెడ్డి కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. ప్రస్తుతం పరిటాల సునీతతోనూ ఆయన సఖ్యతను కొనసాగిస్తున్నారు. మరోవైపు జేసీ దివాకర్ రెడ్డి కుటుంబానికీ ఆయన సన్నిహితుడే. ఈ నేపథ్యంలో గురునాథరెడ్డి వైకాపాలో కన్నా టీడీపీలో చేరడమే బెటరని ఆలోచిస్తున్నట్టు సమాచారం.  

  • Loading...

More Telugu News