: ఆ ప్రయత్నం చేస్తే, ఓడిపోయిన శత్రువుల జాబితాలో చేరినట్టే: ట్రంప్


ఉగ్రవాదులు ప్రపంచంలో ఎక్కడ దాగున్నా వారిని వదిలిపెట్టబోనని, ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించి తీరుతానని యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రతినబూనారు. 16 సంవత్సరాల క్రితం అల్ ఖైదా ఉగ్రవాదులు యూఎస్ పై దాడి చేసిన విషాద సందర్భాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత నెలలో ఉగ్రవాదులకు స్వర్గధామంగా పేరు తెచ్చుకున్న పాకిస్థాన్ పై కటువు వ్యాఖ్యలు చేసిన ఆయన, తమ స్ఫూర్తిని బలహీనపరచాలని ఉగ్రవాదులు అనుకుంటే అది తప్పని హెచ్చరించారు. అటువంటి ప్రయత్నం ఎవరు చేసినా వారు, అమెరికా చేతిలో ఓటమి పాలైన శత్రువుల జాబితాలో చేరినట్టేనని, వారు ఏ మూల దాక్కున్నా వేటాడతామని అన్నారు.

  • Loading...

More Telugu News