: తిరుపతి కపిలతీర్థంలో పడి మరణించిన యువకుడు


రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమైన తిరుపతి యువకుడు బాలాజీ (18) కపిలతీర్థం జలపాతంలో విగతజీవిగా కనిపించాడు. బాలాజీ అదృశ్యమైన తరువాత ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించగా, తిరుమల గిరుల దిగువనే ఉండే కపిలతీర్థం జలపాతం పై భాగాన ఓ ద్విచక్రవాహనం, చెప్పులు కనిపించాయి. అవి బాలాజీవేనని రూఢీ చేసుకున్న పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది యువకుడి కోసం సమీప అటవీ ప్రాంతాల్లో కపిలతీర్థం బావుల్లో సోమవారం నాడంతా గాలించారు.

ఈ ఉదయం యువకుడి మృతదేహం జలపాతంలోనే లభ్యమైంది. చూడటానికి ఎంతో అందంగా ఉండే కపిలతీర్థం జలపాతం పైన ఉన్న నీటి గుంతల్లో స్నానాలకు వెళ్లి యువకులు మృత్యువాత పడటం ఇదే తొలిసారి కాదు. ఈ ప్రాంతంలో ఈతలు కొట్టడం ప్రమాదకరమని తెలిసినా, అధికారులు పూర్తి రక్షణాత్మక చర్యలు చేపట్టడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు మరోసారి వెల్లువెత్తాయి.

  • Loading...

More Telugu News