: రూ. 10 టాటా గ్లూకో ప్లస్ తాగి.. రూ. 500 ఇచ్చి వెళ్లిపోయిన చంద్రబాబునాయుడు!


శ్రీకాకుళం జిల్లా తెట్టంగిలో జరిగిన 'ఇంటింటికీ తెలుగుదేశం' కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న సీఎం చంద్రబాబునాయుడు, గ్రామ కూడలిలోని ఓ కిరాణా దుకాణం వద్ద ఆగి కాసేపుసేదదీరారు. సాయి కుమారి అనే మహిళ నిర్వహిస్తున్న షాపు వద్దకు వెళ్లిన ఆయన, టాటా గ్లూకో ప్లస్ కూల్ డ్రింక్ ను తాగారు. పది రూపాయల విలువైన డ్రింక్ తాగిన ఆయన, రూ. 500 నోటును ఆమెకు ఇచ్చారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు అమలు జరుగుతున్న తీరు తెన్నులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఆపై చిల్లర కూడా తీసుకోకుండానే వెళ్లిపోయారు. ఆపై కొంత దూరంలో ఉన్న దివ్యాంగురాలు నెల్లి ఆదెమ్మ నివాసానికి వెళ్లారు. ఆమెకు పింఛను అందుతోందా? అని ప్రశ్నించారు. అందుతోందని చెప్పిన ఆమె, ఓ ఇల్లును తనకు మంజూరు చేయించాలని కోరగా, తప్పకుండా పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. ఆపై మరో ఇంటికి వెళ్లి, ఆపరేషన్ జరిగిన ఇంటిపెద్ద మంచాన పడటంతో, ఇల్లు గడిచే మార్గం లేదని తెలుసుకుని సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి రూ. 5 లక్షలు తక్షణం మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

  • Loading...

More Telugu News