: పాతబస్తీలో పరువు హత్య... నమ్మకంగా తీసుకెళ్లి హతమార్చిన బావమరిది!
హైదరాబాదులో పరువు హత్య చోటుచేసుకుంది. హైదరాబాదు, మంగళ్ హాట్ లోని అమర్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతనిని ప్రేమించడంతో, కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో వారిద్దరూ పారిపోయి వివాహం చేసుకున్నారు. బెంగళూరులో స్నేహితుల వద్ద వీరు ఆశ్రయం పొందుతున్నారని గుర్తించిన యువతి కుటుంబ సభ్యులు...వివాహం చేస్తామని, ఇంటికి దూరంగా ఉండాల్సిన అవసరం లేదని నమ్మబలికి, నవదంపతులను హైదరాబాదుకు రప్పించారు. అనంతరం అమర్ ను నమ్మించి బయటకు తీసుకెళ్లిన యువతి సోదరుడు, గొంతుకోసి హతమార్చాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు.