: మహిళా టెక్కీని రేప్ చేసి, వీడియో పోర్న్ సైట్ లో పెట్టిన సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆటకట్టు!


విధుల్లో దిశానిర్దేశం చేయాల్సిన సీనియర్ సాప్ట్‌వేర్ ఇంజనీర్ పెడతోవపట్టాడు.. జూనియర్ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై ప్రేమ వల విసిరి జుగుప్సాకరంగా ప్రవర్తించిన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే... పశ్చిమబెంగాల్ కు చెందిన ఆరిందమ్ నాథ్ (28) సీనియర్ సాప్ట్‌ వేర్ ఇంజనీరుగా బెంగళూరులో పనిచేస్తున్నాడు. ఈజిపురా ప్రాంతంలోని వివేక్ నగర్ ఫ్లాట్ లో నివాసం ఉంటున్నాడు. ఒడిశాకు చెందిన యువతి (26) కూడా అతను పని చేసే కంపెనీలో పని చేస్తోంది. సీనియర్ ఉద్యోగి అయిన ఆరిందమ్, ఆమెను ప్రేమిస్తున్నానని కబుర్లు చెప్పి తన ఫ్లాట్ కు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారం చేసి, ఆ తతంగాన్ని తన సెల్ ఫోన్ తో రహస్యంగా చిత్రీకరించాడు.

ఆ తరువాత దానిని ఆమెకు చూపించి, పోర్న్ సైట్ లో పెడతానని బెదిరిస్తూ, తన ఫ్లాట్ కు పలు మార్లు రప్పించుకుని అత్యాచారానికి తెగబడ్డాడు. అయితే ఈ మధ్య కాలంలో డబ్బులు ఇవ్వాలని, లేని పక్షంలో వీడియో పోర్న్ సైట్ లో పెడతానని బెదిరింపులు మొదలు పెట్టాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఆ వీడియోను పోర్న్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. దీంతో జరిగిన దారుణం గురించి ఆమె స్నేహితురాళ్లైన సహోద్యోగులకు వివరించి, వాపోయింది.

వారు ధైర్యం చెప్పడంతో వారితో కలిసి వెళ్లి, పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆరిందమ్ పై పోలీసులు ఐపీసీ సెక్షన్ 376, 384, 506, 66 ఈ, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. విచారణలో ఆరిందమ్ నేరాన్ని అంగకరించడంతో పాటు, పోర్న్ సైట్ నుంచి వీడియోను తొలగించాడు. జరిగిన అవమానంతో బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేయగా, ఆమెను స్నేహితురాళ్లు కాపాడి ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. 

  • Loading...

More Telugu News