: దక్షిణాఫ్రికా ఆటగాడు డుప్లెసిస్‌కు ప్రమోషన్.. మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌గా నియామకం
దక్షిణాఫ్రికా ఆటగాడు ఫా డుప్లెసిస్‌కు ప్రమోషన్ లభించింది. టెస్టులు, వన్డేలు, టీ20 జట్లకు అతనిని కెప్టెన్‌గా నియమిస్తూ దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆరేళ్లపాటు వన్డే జట్టుకు సారథిగా వ్యవహరించిన ఏబీ డివిల్లీర్స్ గత నెలలో తప్పుకోవడంతో ఆ బాధ్యతలను ఇప్పుడు డుప్లెసిస్ స్వీకరించనున్నాడు. వచ్చే నెలలో బంగ్లాదేశ్‌తో జరగనున్న సిరీస్‌లో పూర్తిస్థాయి కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఇంగ్లండ్ టూర్లో సౌతాఫ్రికా ఘోరంగా విఫలమవడం, దీనికి తోడు ఇటీవల జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కారణంగా కెప్టెన్సీ బాధ్యతల నుంచి డివిల్లీర్స్ తప్పుకున్నాడు.