: పండుగల తేదీలపై వివాదాలకు చెక్.. వచ్చే ఏడాది పండుగల జాబితా ప్రకటన!
పండుగల తేదీల విషయంలో తలెత్తుతున్న వివాదాలను పరిష్కరించేందుకు తెలంగాణ రాష్ట్రంలోని సిద్ధాంతులు, జ్యోతిష్యులు, పంచాంగకర్తలు వచ్చే విళంబి నామ సంవత్సరంలోని పండుగల జాబితాను ప్రకటించారు. పండుగ తేదీలను ముందుగానే ప్రకటించడం వల్ల వాటిపై తలెత్తే వివాదాలను త్వరగా పరిష్కరించే వీలుంటుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు రెండు రోజులపాటు హైదరాబాద్లో నిర్వహించిన విద్వత్ సభ నిర్ణయాలను సభ నిర్వాహకులు ఎం.వెంకటరమణ శర్మ, దివ్యజ్ఞాన సిద్ధాంతి, గాయత్రీ తత్వానంద రుషి, యాయవరం చంద్రశేఖర శర్మలు ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసి ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేశారు. వారు ముఖ్యమంత్రికి అందించిన జాబితా ప్రకారం..
మార్చి 18- ఉగాది, 25న స్మార్తానాం శ్రీరామ నవమి, 26న వైష్ణవానాం శ్రీరామ నవమి, ఏప్రిల్ 18న అక్షయ తృతీయ, మే 10న హనుమాన్ జయంతి, జూలై 27న వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ, 29, సికింద్రాబాద్ మహంకాళి జాతర, ఆగస్టు 24 వరలక్ష్మీ వ్రతం, 26న రాఖీ పూర్ణిమ, సెప్టెంబరు 2 స్మార్తానాం శ్రీకృష్ణాష్టమి, 3న వైష్ణవానాం శ్రీకృష్ణాష్టమి, 13న వినాయక చవితి, అక్టోబరు 17న దుర్గాష్టమి, 18న విజయ దశమి, నవంబరు 6న దీపావళి, 23 న కార్తీక పౌర్ణమి, 2019 జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ, 12న రథ సప్తమి, మార్చి 4 మహా శివరాత్రి, 19న కామదహనం (దక్షిణాది వారికి), 20న కామదహనం (ఉత్తరాదివారికి), 21న హోలీ.