: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ బొనాంజా.. పండుగ నేపథ్యంలో ఈ నెల ముందుగానే వేతనం!


రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఈ నెల వేతనాన్ని ముందుగానే చెల్లించాలని నిర్ణయించింది. మామూలుగా ప్రతినెల 1వ తేదీన జీతాలు చెల్లిస్తుంది. అయితే ఈనెల 29 బతుకమ్మ, 30న దసరా కావడంతో ముందుగానే ఇస్తే పండుగ ఖర్చులకు ఉపయోగపడతాయని భావించిన ప్రభుత్వం అందుకు సంబంధించిన ఫైలును ఆర్థిక శాఖ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు పంపింది. సీఎం ఆమోదం లభించిన వెంటనే జీతాలు ఎప్పుడివ్వాలనే దానిపై స్పష్టత వస్తుందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News