: అందుకే, గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ముద్రగడ కలిశారట!


టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి నివాసానికి బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలసి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఈ రోజు వెళ్లిన విషయం తెలిసిందే. తాము ముగ్గురం కేవలం వ్యక్తిగతంగానే కలిసాము తప్పా,రాజకీయ కోణం లేదని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేయడం విదితమే. ఆయన చెప్పిన మాటలు నిజమేనని ముద్రగడ వర్గాల సమాచారంగా ఉంది. ముద్రగడ పద్మనాభం వియ్యంకుడి స్థల వివాదం పరిష్కారం నిమిత్తమే ఈ భేటీ జరిగిందట. రాజమండ్రి రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ స్థలం వ్యవహారంలో బిల్డర్ కి, ముద్రగడ వియ్యంకుడికి మధ్య విభేదాలు తలెత్తాయని, వాటిని పరిష్కరించుకునే నిమిత్తం గోరంట్ల వద్దకు ఎమ్మెల్యే సత్యనారాయణను వెంటబెట్టుకుని ముద్రగడ వెళ్లారని సమాచారం.

  • Loading...

More Telugu News