: ఆర్య వైశ్య ప్రతినిధులు వస్తే చర్చించి మార్పులు చేస్తా: కంచ ఐలయ్య


మాజీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య రాసిన ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’ అనే పుస్తకంపై ఆర్యవైశ్య సంఘాలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంచ ఐలయ్య స్పందిస్తూ, ‘2007లో రాసిన పుస్తకానికి తెలుగు అనువాదం తాజా పుస్తకం ‘సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు’. ప్రస్తుతం వైశ్య సామాజిక వర్గంలో చాలా మార్పులు వచ్చాయి. ఇతర సామాజిక వర్గాలతో కలిసి వ్యాపార భాగస్వామ్యం పంచుకునే పరిస్థితులు వచ్చాయి. వైశ్య సామాజిక వర్గంపై ఇప్పుడు పుస్తకం రాయాల్సి వస్తే, మారిన పరిస్థితులకు తగినట్టుగానే రాస్తాను. నా పుస్తకంపై సుహృద్భావ వాతావరణంలో చర్చించాలని విఙ్ఞప్తి. ఈ పుస్తకం టైటిల్, అంశాలు మార్చేందుకు నేను సిద్ధం. ఆర్యవైశ్య ప్రతినిధులు వస్తే చర్చించి మార్పులు చేస్తా’ అని అన్నారు.

 

  • Loading...

More Telugu News