: 2011లోనే బీజేపీలో చేరాలనుకున్నా: టీఆర్ఎస్ నేత డీఎస్ కుమారుడు అరవింద్
2011లోనే బీజేపీలో చేరాలని తాను అనుకున్నానని టీఆర్ఎస్ నేత డీఎస్ కుమారుడు అరవింద్ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ మా తాత జనసంఘ్ నేత. నేను కూడా మా తాత బాటలోనే వెళ్లాలని అనుకుంటున్నా. బీజేపీ ఏ పని అప్పజెప్పినా చేసేందుకు నేను సిద్ధం. నా భావజాలానికి బీజేపీ మాత్రమే సరిపోతుంది. బీజేపీలో చేరుతున్నట్టు మా నాన్నకు సమాచారం ఇచ్చా..చర్చించలేదు. మోదీపై ఇచ్చిన పత్రికా ప్రకటనకు ఒక్కరోజు ముందే మా నాన్నకు చెప్పా. 2019లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్నా. మా నాన్న ఎవరి తరపున ప్రచారం చేస్తారో వారి ఇష్టం’ అని అన్నారు.